రెడ్డి బ్రదర్స్ న్యూస్ ఛానల్?

Posted December 20, 2016

reddybrothers news channel
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు..వెంకటరెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఇద్దరూ టీ.కాంగ్రెస్ లో మరింత ఎదగాలని భావిస్తున్నారు. అందులో భాగంగా సొంతంగా తమకంటూ బలమైన మీడియా ఉండాలని రెడ్డి బ్రదర్స్ గట్టిగా నిర్ణయించుకున్నారట.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూలమైన న్యూస్ ఛానల్స్ ఏవీ లేవు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దిగజారడంతో మీడియా కవరేజ్ కూడా తగ్గింది. ఇక తెలంగాణలో పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా వాయిస్ వినిపించడానికి బలమైన మీడియాలో లేదు. తరుణంలో న్యూస్ ఛానల్ తీసుకొస్తే.. అటు పార్టీకి.. ఇటు వ్యక్తిగతంగా తమకు మైలేజ్ వస్తుందని గట్టిగా డిసైడైపోయారట రెడ్డి బ్రదర్స్. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా తమ నిర్ణయాన్ని చెప్పారట. పార్టీ పెద్దలు కూడా న్యూస్ ఛానల్ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారని సమాచారం.

న్యూస్ ఛానల్ కు సంబంధించిన పనులు జోరుగా ముందుకు సాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయ్యిందని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఉగాదిలోపే న్యూస్ ఛానల్ వస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY