రిలయన్స్ కి నోట్ల రద్దు గురించి తెలుసా?

Posted [relativedate]

reliance know about the currency ban
500,1000 నోట్ల రద్దు గురించి అధికార వర్గాలకి కూడా తెలియకుండా ప్రధాని మోడీ గోప్యత పాటించారని వార్తలు వచ్చాయి.అయితే అందులో నిజం లేదని అయన వ్యతిరేకులు వాదిస్తున్నారు.రిలయన్స్ కి అంటే ముకేశ్ అంబానీకి ఈ విషయం చాలా ముందే తెలిసి ఉండొచ్చని వారు వాదిస్తున్నారు.ముకేశ్ ,మోడీ మధ్య సంబంధాలతో పాటు అందుకు వారు చూపుతున్న మరో ప్రధాన కారణం జియో.

మోడీ వ్యతిరేకుల వాదన ఇలా వుంది … జియో లో భారీ ఎత్తున నల్లధనం పెట్టుబడిగా కుమ్మరించిన ముకేశ్ ఈ ఏడాది డిసెంబర్ 30 దాకా కస్టమర్లకి ఉచితంగా సేవలు అందిస్తున్నాడు.అంటే అప్పటిదాకా నోట్ల రద్దు ప్రభావం జియో మీద ఉండదు.వచ్చే జనవరి నుంచి వినియోగదారుల నుంచి వైట్ లో ఛార్జ్ లు వసూలు చేస్తారు.దీని వల్ల జియో లో పెట్టుబడిగా పెట్టిన నల్లధనం తెల్లధనం అయిపోతుంది కదా అని ఒక వాదన వినిపిస్తోంది.