మావో అగ్రనేత ఆర్కే ఎక్కడ?

 Posted November 3, 2016

reveal where abouts of maoist leader rkమావోయిస్టు అగ్రనేత ఆర్కే ఎక్కడున్నాడన్నదానిపై సందిగ్ధం వీడలేదు.అయన భార్య శిరీష వేసిన హెబియస్ కార్పస్ పిటీషన్ మీద హై కోర్ట్ లో విచారణ జరిగింది.ఆర్కే తమ అదుపులో లేరని పోలీస్ శాఖ హై కోర్ట్ కి తెలిపింది.అయితే అందులో నిజం లేదని శిరీష తరపు న్యాయవాది అన్నప్పుడు …ఆర్కే పోలీస్ అదుపులో ఉన్నట్టు ఆధారాలున్నాయా అని కోర్ట్ ఎదురు ప్రశ్నించింది.అందుకు 10 రోజులు గడువు కావాలని ఆమె న్యాయవాది చేసిన విన్నపాన్ని కోర్ట్ అంగీకరించింది.దీంతో ఈ కేసు విచారణని కోర్ట్ రెండు వారాలకి వాయిదా వేసింది.దీంతో ఆర్కే ఎక్కడన్న అంశం మళ్లీ మొదటికొచ్చింది.

Post Your Coment
Loading...