అదృష్టం ఎవరిని వరిస్తుంది?

Posted October 14, 2016

 Richard Wiseman The University of Hertfordshire research about The Secret of Luck
వాడిది చాలా లక్కీ హ్యాండ్ రా…అబ్బో వీడిది ఐరన్ లెగ్…రోజువారీ జీవితంలో ఇలాంటి సంభాషణలు మనందరికీ చిరపరిచితమే..అసలు ఎవరిని అదృష్టం వరిస్తుంది?ఎందుకు వరిస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేశారు ఓ పరిశోధకుడు.హెర్ట్ ఫోర్డ్ షైర్ యూనివర్సిటీ కి చెందిన వైస్ మాన్.అయన పరిశోధనల్లో అదృష్టం,దురదృష్టం వెనుక మేజిక్ లేదని లాజిక్ మాత్రమే ఉందని నిరూపించాడు.ఈ మనస్తత్వ శాస్త్రవేత్త వెల్లడించిన విషయాలివి..
‘పదేళ్ల కిందట అదృష్టవంతుల గుట్టు తెలుసుకోడానికి ఓ ప్రయోగం చేశా.కొంతమందిని ఎప్పుడూ సరైన సమయానికి సరైన చోట ఎందుకు వుంటారు?మరికొందరిని నిత్యం దురదృష్టం వెన్నాడుతుంది? ఇది తెలుసుకోడానికి ఓ జాతీయ దిన పత్రికలో ప్రకటన ఇచ్చా.తమని తాము లక్కీ,లేదా అన్ లక్కీ అనుకునేవాళ్ళని నన్ను సంప్రదించామని కోరా.

వందలమంది అసాధారణ వ్యక్తులు,మహిళలు నా పరిశోధనకు సహకరించారు.సంవత్సరాలకొద్దీ వారితో మాట్లాడా..వారి జీవనశైలిని పరిశోధించా.లక్కీ, అన్ లక్కీ వ్యక్తుల మధ్య వున్నది సామర్ధ్య అంతరమే అని చెప్పే ఓ ప్రయోగం చేశా.లక్కీ,అన్ లక్కీ అనుకునేవాళ్ళని ఒకే దగ్గరికి చేర్చి వారి చేతికి ఓ వార్తాపత్రిక ఇచ్చా.అందులో ఎన్ని ఫోటో గ్రాఫ్ లు ఉన్నాయో చెప్పమని అడిగా.అయితే వారెవరికీ తెలియకుండా పత్రిక మధ్య భాగంలోఅక్షరాలతో మామూలు కన్నా పెద్ద అక్షరాలతో ఈ ప్రకటన మీరు చూసినట్టు ప్రయోగం చేసే వాళ్ళకి చెప్పి 50 డాలర్లు బహుమానం తీసుకోండని ప్రకటించాము.అన్ లక్కీ అనుకునేవాళ్లు దాన్ని గుర్తించలేదు.లక్కీ అనుకునేవాళ్లు మాత్రం ఈ ప్రకటన గుర్తించారు.ఇలా ఎందుకు జరిగిందంటే?

అన్ లక్కీ అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ టెన్షన్ తో వుంటారు.ఆ ఆత్రుత,కంగారు వల్ల అనుకోని అవకాశం ఎదురైనప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించలేరు.దానివల్లే వాళ్ళు అవకాశాలు కోల్పోతారు.దేనికోసమైతే ఎదురుచూస్తారో దాన్ని తప్ప వేరే విషయాన్ని గుర్తించలేరు.వాళ్ళు తమకి మంచి జోడీ కావాలనుకునే పార్టీలకి వెళతారు.మనసంతా దాని చుట్టూనే తిప్పుతూ చాలా మందితో స్నేహం చేసే అవకాశం కోల్పోతారు.ఇక పత్రికల్లో తమకి సరిపోయే ఉద్యోగ ప్రకటన కోసం చూస్తూ అంతకన్నా మంచి అవకాశాలు వున్నా పట్టించుకోరు.

అదృష్టవంతులు అందుకు పూర్తి భిన్నం.వాళ్ళు ప్రశాంతంగా తమకి కావాల్సిన వాటితో పాటు మిగతా అంశాల్ని కూడా పరిశీలిస్తుంటారు.వాళ్ళకి అదృష్టం తాము అనుసరించే పద్ధతుల వల్లే వస్తుంది.వాళ్ళు తమకి తాము అవకాశాల్ని సృష్టించుకోగలరు ..ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోగలరు.మనస్సాక్షి చెప్పినట్టే అదృష్టవంతులు నడుచుకుంటారు.అందుకే కొన్ని తప్పుడు నిర్ణయాలు జరిగినా వాటిని పాజిటివ్ గా మార్చుకోగలరు’.
అదృష్టవంతులు కావడానికి ప్రొఫెసర్ వైస్ మాన్ చెప్పిన 4 చిట్కాలు

1.మీ అంతర్వాణి ఏమి చెప్పిందో దాన్నే వినండి..అదెప్పుడు కచ్చితంగా చెబుతుంది
2.కొత్త అనుభవాలు,పరిస్థితులు ఎదుర్కోడానికి సిద్ధంగా వుండండి.రొటీన్ విధానాలకు స్వస్తి చెప్పండి.
3 . అన్ని సవ్యంగా జరిగిన అనుభవాలు,అనుభూతుల్ని గుర్తుకు తెచ్చుకోడానికి రోజులో కొద్ది సమయం కేటాయించండి.
4.ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించుకోండి.
ఈ ప్రపంచంలో అదృష్టవంతులు కష్టాలు లేని వాళ్ళు కాదు.వాటిని భరిస్తూ కూడా జీవితాన్ని ఆస్వాదించగలిగేవాళ్ళు.ఇదే లక్కీ, అన్ లక్కీ మధ్య తేడా. దురదృష్టవంతులు సమస్యని మాత్రమే చూస్తే ..అదృష్టవంతులు దాని పరిష్కారాన్ని కూడా చూస్తారు.ఎటు వైపు ఉండాలో మీకు మీరే నిర్ణయించుకోండి.ఆల్ ది బెస్ట్ .

NO COMMENTS

LEAVE A REPLY