ఏకధాటిగా పనిచేసి ప్రాణం వదిలిన మేనేజర్..

Posted November 17, 2016 (4 weeks ago)

rohtak cooperative bank manager dead in officeఏకధాటిగా మూడు రోజుల పాటు విధుల్లో పాల్గొన్న ఓ బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. హర్యానాలోని రోహ్తక్ కోపరేటివ్ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వినియోదారులు భారీగా పోటెత్తుతున్నారు.

దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఉదయాన్నే తెరవడంతో పాటు రద్దీని బట్టి పొద్దపోయేదాకా పనిచేస్తున్నాయి. రోహ్తక్ సహకార బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్.. పని ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల నుంచి రాత్రి పూట కూడా ఆఫీస్‌లోనే గడుపుతున్నారు. దీనికి తోడు మేనేజర్‌కు గుండెజబ్బుకూడా ఉందట బుధవారం ఉదయం సెక్యూరిటీ గార్డు మేనేజర్ ఆఫీస్ గది వద్దకు వెళ్లి తలుపు తట్టగా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో అతడు ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపు బద్దలుకొట్టి చూడగా.. బ్యాంకు మేనేజర్ అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు.

NO COMMENTS

LEAVE A REPLY