ఆ పుకార్లకు తెరదించిన రోజా ..

  roja reveal about party changing

వైసీపీ లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా.. అయితే ఆమె కూడా మళ్లీ పాతగూడు టీడీపీ కి చేరుకుంటారని కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. చంద్రబాబు మీద ఒంటికాలి మీద లేచే ఆమె పార్టీ ఎలా మారతారా అని సందేహాలొస్తున్నా రాజకీయాల్లో ఏదైనా జరోగొచ్చనే అనుమానం ఉండేది. ఈ విషయం మీద రోజా మాట్లాడకపోవడంతో డౌట్లు పెరిగాయి.

తనపై వస్తున్నరూమర్లకు రోజా తెర దించారు. తాను వైకాపాను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె ఈ అంశంపై స్పందించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై దేశం నేతలు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని రోజా ఆరోపించారు.

Post Your Coment
Loading...