జగన్ పై రోశయ్య ఫీలింగ్స్ ..

0
131

   rosaiah feeling jagan sakshi interview
సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోశయ్య…వైసీపీ అధినేత గురించి తన అభిప్రాయం వెల్లడించారు.కాంగ్రెస్ లో ఉంటేనే జగన్ రాజకీయ భవిష్యత్ బాగుండేదని అయన అభిప్రాయపడ్డారు.రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ ని ఆనాడు.. ఈనాడు గౌరవిస్తానని రోశయ్య చెప్పారు.జగన్ తనకు శత్రువు కాదు మిత్రుడు కాదని రోశయ్య స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని జగన్ కి తాను చెప్పలేదన్నారు.

వై.ఎస్ రాజశేఖర రెడ్డి,జగన్ మధ్య తేడా ఏంటని అడిగినప్పుడు తనదైన శైలిలో రోశయ్య చెప్పకనే చెప్పారు.రాజశేఖర్ రెడ్డి కి సొంత ఆలోచన వున్నా నలుగురితో మాట్లాడి నిర్ణయం తీసుకునేవాడని రోశయ్య వివరించారు. జగన్ తో కలిసి పనిచేయలేదు కాబట్టి అయన గురించి చెప్పలేనన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY