నేను సోల్జర్ ని కాదు: సాయి ధరమ్ తేజ్

Posted February 4, 2017 (3 weeks ago)

sai dharam tej says i am not playing soldier role in jawan movieమెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో దాదాపు అందరూ దేశాన్ని రక్షించే పాత్రల్లో నటించిన వారే. అయితే కొందరు పోలీస్ పాత్రల్లో నటిస్తే ఇద్దరు ముగ్గురు ఏకంగా సోల్జర్స్ పాత్రల్లో నటించారు. చిరంజీవి స్టాలిన్ సినిమాలో ఆర్మీ మేజర్ గా నటిస్తే కంచె సినిమాలో వరుణ్ తేజ్ సోల్జర్ గా నటించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో ఓ పాటలో సైనికుడి వేషంలో దర్శనమిచ్చాడు. తాజాగా సాయిధరమ్ కూడా సోల్జర్ వేషంలో నటించనున్నడని వార్తలు వస్తున్నాయి.

మూడు రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా జవాన్ సినిమా ప్రారంభమైందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయధరమ్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఈ యంగ్ హీరో ఖండించాడు. ఈ చిత్రంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా, దేశ భక్తుడి పాత్రను పోషిస్తున్నానని తెలిపాడు. దేశం-కుటుంబం..ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే పరిస్థితి తలెత్తే ఓ సన్నివేశం ఈ చిత్రంలో ఉంటుందని, అప్పుడు హీరో దేశానికే మొదటి ప్రాముఖ్యతను ఇస్తాడని సాయి ధరమ్ వివరించాడు.

కాగా ఈ సినిమాలో తన పాత్ర  కోసం చాలా బరువు తగ్గానని, చక్కటి ఫిట్ నెస్ తో కనపడతానని అలాగే ఇంతకు ముందు సినిమాల్లో కనిపించిన తన  హెయిర్ స్టైల్ కి ఈ సినిమాలో ఉండబోయే హెయిర్ స్టైల్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

కాగా పాండవులు పాండవులు తుమ్మెద, కింగ్, దేనికైనా రెడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మాటలు అందించిన బీవీఎస్ రవి ఈ జవాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించి  చేతులు కాల్చుకున్న రవిని, తిక్క సినిమాతో  కాస్త వెనకబడ్డ సాయి ధరమ్ ని  జవాన్  కాపాడతాడో లేదో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY