ఇప్పటికి నేను వర్జిన్ నే : సల్మాన్ ఖాన్

Posted December 14, 2016

Salman Shocking Comments At Coffee With Karan Programబాలీవుడ్ కండల వీరుడు మరోసారి తన వర్జినిటీ గురించి ప్రస్థావించడం బీ టౌన్ హాట్ న్యూస్ గా మారింది. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ 100వ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ తన సోదరులు ప్రోగ్రాం లో షాకింగ్ కామెంట్స్ తో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశారు. కెరియర్ మొదలుపెట్టిన నాటి నుండి చేసే ప్రతి హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ వచ్చే సల్మాన్ ఖాన్ ఇప్పటికి తను వర్జిన్ అని చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు.

కరణ్ జోహార్ అడిగిన ఈ ప్రశ్న తనకు మూడేళ్ల క్రిందట కూడా ఎదురైంది అప్పుడు కూడా తాను ఇదే సమాధానం చెప్పానని తాను ఇప్పటికి వర్జిన్ గానే ఉన్నానని అంటున్నాడు సల్మాన్ ఖాన్. ఇక పెళ్లి ఎవరిని చేసుకుంటావ్ అన్న ప్రశ్నకు మాత్రం సల్మాన్ తడుముకుంటూనే సమాధానం ఇచ్చాడు. కత్రినాతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రస్థావించిన సల్మాన్ తనకు ఫ్రెండ్ గా ఉంటానని అన్నాడు.

కొద్ది కాలంగా సల్మాన్ కత్రినాల మధ్య డిస్టన్స్ పెరిగిందని తెలిసిందే. అయితే బయట మాత్రం దూరంగా ఉన్నా ఇద్దరికి ఇద్దరి గురించి బాగా తెలిసినట్టు ప్రవర్తించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

Post Your Coment
Loading...