రోగ్ పై మనసుపడ్డ సల్మాన్..!!

Posted February 13, 2017 (2 weeks ago)

salmankhan producing roge movie in hindiగతేడాది సుల్తాన్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటివరకు బాలీవుడ్ కండలవీరుడు అని పిలిచిన వారందరూ సుల్తాన్ సినిమా అందుకున్న విజయంతో సల్మాన్ ని బాలీవుడ్ సుల్తాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ట్యూబ్ లైట్ సినిమాతో బిజిగా ఉన్న సల్మాన్ కన్ను ప్రస్తుతం ఓ తెలుగు సినిమాపై పడింది.

మహాత్మ సినిమా నిర్మాత కొడుకు ఇషాన్ ను హీరోగా పరిచయం పూరీ జగన్నాధ్.. రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోగ్ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే యోచనలో ఉన్నాడట సల్మాన్ ఖాన్. అయితే  ఈ రీమేక్‌లో సల్మాన్ నటించడం లేదట. కేవలం నిర్మాతగానే వ్యవహరించనున్నాడట. తాను పరిచయం చేసిన సూరజ్ పంచోలితో  ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో సల్మాన్‌ ఉన్నాడట.

ఆల్రెడీ రెడీ, పోకిరి, కిక్‌ వంటి హిట్ సినిమాలను హిందీలోకి  రీమేక్‌ చేసి హిట్స్ కొట్టాడు  సల్మాన్. మరి  ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న వస్తున్న  రోగ్ సినిమాపై  సల్మాన్‌ కు ఉన్న నమ్మకం ఏంటో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY