“ఎంగేజ్ మెంట్” న్యూస్ బ్రేక్ చేసిన స‌మంత‌…

Posted [relativedate]

samantha tweet about engagement of anirudh
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న‌స‌మంత రూటే వేరు. మిగ‌తా హీరోయిన్లు ట్విట‌ర్ల ద్వారా కామెంట్లు చేయ‌రు. కానీ స‌మ్మూకు మాత్రం కాంట్ర‌వ‌ర్సీస్ క్రియేట్ చేయ‌డమే ఇష్టం. ఆ మ‌ధ్య వ‌న్ పోస్ట‌ర్ గురించి కామెంట్ చేసింది. ఆ సినిమా హీరో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కావ‌డంతో అది పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. అలాగే అత్తారింటింది దారేది అన్న టైటిట్ ను కూడా ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ రివీల్ చేసింది ఈ అమ్మ‌డే. త్రివిక్ర‌మ్- ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ పై స‌స్పెన్స్ క్రియేట్ చేస్తే…. స‌మ్మూ మాత్రం ఆ స‌స్పెన్స్ కు తెర‌దించుతూ ఏకంగా టైటిట్ నే బ‌య‌ట‌పెట్టేసింది. ఇలా అడ‌పా ద‌డ‌పా ఈ ముద్దుగుమ్మ ట్విట్ట‌ర్ ద్వారా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా త‌న సన్నిహితుడు, వైదిస్ కొల‌వ‌రి క్రియేట‌ర్ అయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ను న్యూస్ లోకి లాగింది.

అనిరుధ్ కు ఒక గ‌ర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయితో నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయింద‌ని కోలీవుడ్ లో ఊహాగానాలొచ్చాయి. దానికి ఈ చిన్నోడు… నేను ఇంకా చిన్న‌పిల్ల‌వాడినే… నాకు పెళ్లేంటి అన్నాడ‌ట‌. అంత‌టితో ఇష్యూ ముగిసింద‌ని అనుకుంటున్న త‌రుణంలో స‌మంత ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి బావుంటుంది క‌దా… అంటూ ట్వీట్ చేసింది. అంతే అనిరుధ్ కి నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌న్నగాపిస్ కు బ‌లం చేకూరింది. ఇంత‌కూ ఎంగేజ్ మెంట్ జ‌రిగిందా.. లేదా అన్న‌ది ప‌క్క‌న బెడితే. స‌మంత ట్వీట్ గురించి ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

Samantha Ruth Prabhu Retweeted Anirudh Ravichander

but she was such a sweet girl .. what happened ?