సాగర సంగమం రఘు మాటలు

0
90

 sarath babu raghu words saagara sangamam

మంచి సినిమాకు అవార్డులతో పనిలేదని, ప్రేక్షకుల మనసుల్లో ఆ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోవడమే పెద్ద పురస్కారమని శరత్‌బాబు చప్తున్నారు. నలుగురు కూర్చుని.. చర్చించి..ఇచ్చే అవార్డు కన్నా నాలుగు కోట్ల మంది మదిలో ఆ చిత్రం ఉండడమే ఎంతో గొప్పదన్నారు. ‘సాగరసంగమం’ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, దాంట్లో శరత్‌బాబు కనపడలేదని, తాను పోషించిన రఘు పాత్రే కనిపిస్తుందని చెప్పారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. తెలుగులో పది మంచి సినిమాలు చెప్పమంటే.. అందులో విశ్వనాథ్ తీసినవే అగ్రస్థానంలో ఉంటాయని చెప్పారు.

ఉత్తమ నటుల్లో కమల్‌హాసన్ ఒకరని చెప్పిన శరత్ బాబు సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం-3లో నటిస్తున్నారు. కన్నడంలో మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అన్నయ్య, క్రిమినల్ సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలకు మంచి పేరు వచ్చింది.

NO COMMENTS

LEAVE A REPLY