ఆమెకి సీఎం యోగం..ఆయనకి ఆస్పత్రి మంచం

Posted February 6, 2017 (3 weeks ago)

sashikala into cm chair and natrajan into hospitalచిన్నమ్మ శశికళ కి పదవీ యోగం పట్టినా దాన్ని ఆస్వాదించే అవకాశం లేని పరిస్థితులు చుట్టుముడుతున్నాయి.ఆమెకి సీఎం పీఠం ఖాయమని తేలిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పని బయటికి వచ్చింది.ఆ విషయాన్ని దిగమింగుకునే లోపే మరో ఇబ్బంది చిన్నమ్మని చుట్టుముట్టింది.శశికళ భర్త నటరాజన్ అనారోగ్యంతో నిన్న అర్దరాత్రి ఆస్పత్రి పాలయ్యారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో జయకి చికిత్స జరిపించిన అపోలో ఆస్పత్రికే నటరాజన్ ని తీసుకెళ్లారు.

శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం మీద వచ్చిన విమర్శల్ని నటరాజన్ దీటుగా ఎదుర్కొన్నారు .30 ఏళ్లుగా జయకి సేవ చేసిన తమ కుటుంబానికి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఉందని ఆయన బల్ల గుద్ది వాదించారు.అయితే సీఎం పీఠం విషయంలో నటరాజన్ ఇటీవల భిన్నంగా స్పందించారు.సీఎం పన్నీర్ సెల్వం బాగానే పనిచేస్తున్నందున ఇప్పట్లో శశికళ ఆ పదవి చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.అయితే పరిణామాలు పూర్తిభిన్నంగా సాగాయి.అటు నటరాజన్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రి మంచం ఎక్కారు.సీఎం పీఠం అనగానే శశికి ఇంతటి కఠిన పరిస్థితులు ఎదురుకావడం ఆమె అభిమానుల్ని ఆందోళనకి గురి చేస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY