శశికళ సూసైడ్ అటెంప్ట్?

 Posted February 15, 2017 (2 weeks ago)

sasikala appointed aiadmk deputy general secretary as dinakaran
కాలం ఎదురుతిరుగుతున్నప్పుడు మనసు దిటవుగా ఉంచుకోవడం స్థితప్రజ్ఞులకే సాధ్యం.కానీ శశికళ ఆ కోవలోకి రాదని అర్ధమైంది.జయ సమాధి వద్ద ఆమె చేసిన హడావిడి,సినిమా స్టైల్ శపధాలు శశి ఆందోళన,ఆవేదనకు అద్దం పడుతున్నాయి.ఆ కంగారులోనే ఆమె తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయంగా ఆమె పాలిట ఆత్మహత్యా సదృశ్యం అయింది.పన్నీర్ ఎంతగా ప్రయత్నించినా శశి వర్గంలో నిట్టనిలువునా చీలిక తేలేకపోయారు.కొద్ది మంది మాత్రమే అటు నుంచి ఇటు వచ్చారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క సారిగా సీన్ మొత్తం మార్చేసింది.అదే అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ గా దినకరన్ నియామకం.పన్నీర్ అనుభవంతో తనకు బద్ధుడుగా వుండే వారిని ఎంచుకోవాలని శశికళ భావించి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.కానీ ఆమె ఓ చిన్న లాజిక్ మిస్ అయింది.తాను నియమించే వ్యక్తిని పార్టీ ఆమోదిస్తుందా అన్న ఆలోచన లేకుండా శశికళ తీసుకున్న నిర్ణయం ఆమె పాలిట శాపమైంది.

జయ ఆశయ సాధనే లక్ష్యమంటూ చెప్తున్న శశికళ ఒకప్పుడు ఆమె పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టిన దినకరన్ కి ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పీట వేయడం ఆత్మహత్యా సదృశ్యం.దినకరన్ నియామకం తర్వాత పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుప్పుస్వామి అన్నాడీఎంకేకి రాజీనామా చేశారు.ఇక శరవణన్ అనే ఎమ్మెల్యే గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయటపడి శశికళపై ,పళనిస్వామిపై కిడ్నాప్ కేసు పెట్టారు.ఇదంతా దినకరన్ నియామకం ప్రభావమే.ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు శశికి వ్యతిరేకంగా గొంతెత్తే అవకాశముంది.ఈ నిర్ణయంతో రాజకీయాల్లో హత్యలుండవు..ఆత్మహత్యలు తప్ప అన్న నానుడి ఇంకోసారి నిజమైంది.

NO COMMENTS

LEAVE A REPLY