శశి అరుపులు,కేకలు ఎందుకంటే?

 Posted February 15, 2017 (2 weeks ago)

sasikala crying and angry on jayalalitha tomb before going jail
అర్రులు చాచిన సీఎం పీఠం దూరమైంది..వద్దనుకుని భయపడ్డ జైలు జీవితమే ఖరారైంది. పార్టీ లో తన మాటకు ఎదురు లేదనుకుంటే …పిల్లిలా వుండే పన్నీర్ పులిలా మారాడు.ఇన్ని ఎదురుదెబ్బల తర్వాత శశికళ మానసికంగా ఎలా వున్నారు? ఆమె బ్యాలన్స్ తప్పారు.కోర్టులో లొంగిపోడానికి వెళ్లే ముందు జయ సమాధి వద్దకు చేరిన శశికళ వింతవింతగా ప్రవర్తించారు.జయకి నివాళులు అర్పిస్తూ శశికళ భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి.తీవ్ర ఆవేదన,అసహనం తో సమాధి మీద చేత్తో కొడుతూ రౌద్రంగా ఏదో మాట్లాడుతూ కనిపించారు.ఆమె హావభావాలు చూసి అనుచరులు ఎవరూ శశి దగ్గరకు కాసేపు రాలేదు.

శశి మాట్లాడిన మాటలు విన్నవాళ్ళు ఆమె శపధం చేసినట్టు చెపుతున్నారు.తాను జైలుకి వెళ్లాల్సివచ్చినందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన శశికళ అన్నాడీఏంకేని కాపాడతానని శపధం చేసినట్టు తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ కి కొన్ని గంటల ముందే ….జయ ఒకప్పుడు పార్టీ నుంచి బయటకు పంపిన తన బంధువులు దినకరన్,వెంకటేష్ లాంటి వాళ్ళని తెరమీదకి తెచ్చింది శశికళ.దినకరన్ ని పార్టీ డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది.వారిని ఒకప్పుడు జయ పోయెస్ గార్డెన్ నుంచి తరిమేసింది.అయినా ఈ టైం లో వారిని అందలమెక్కించడానికి శశి ప్రయత్నించడం తమిళుల్లో ఆగ్రహానికి కారణం అవుతుంది.పైగా జయ సమాధి పై కొట్టడమేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ అరుపులు,కేకలతో శశి బ్యాలన్స్ కోల్పోయిందని జనమంతా కళ్లారా చూశారు.

NO COMMENTS

LEAVE A REPLY