రేపటితో శశికళ భవిష్యత్ .?

Posted February 13, 2017 (2 weeks ago)

sasikala future knows tomorrow because of court judgementజయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండవ నిందితురాలిగా ఉన్న శశికళ భవితవ్యం మంగళవారంనాడు తేలనుంది. ఈ కేసులో దోషిగా తేలితే శశికళ జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ముఖ్యమంత్రి పీఠం కోసం బలపరీక్షకు సిద్ధమవుతున్న ఆమె ఆశలు గల్లంతైనట్టే. ఒకవేళ నిర్దోషిగా బయటపడితే అధికార పీఠం, ఎమ్మెల్యేల మద్దతు ఆమెకు అనుకూలంగా ఉండే అవకాశాలుంటాయి. ఈ కేసుపై తీర్పు వారం రోజుల్లో ఇవ్వనున్నట్టు ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి తుదితీర్పు వెలువడక ముందే జయలలిత కన్నుమూయడంతో ఆమె పేరును కేసు నుంచి తొలగించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం గతం వారంలో సుప్రీంకోర్టును కోరింది.

రూ.66 కోట్ల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయలలిత మొదటి ముద్దాయి కాగా, శశికళ రెండో మద్దాయిగా ఉన్నారు. ఇళవరసి, సుధాకరన్‌ మూడు, నాలుగో ముద్దాయిలుగా ఉన్నారు. చెన్నై, బెంగళూరుల్లో ఈ కేసు 18 ఏళ్ల పాటూ నడిచింది. ఈ కేసులో జయకు రూ.100 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష పడింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు తలా రూ.10 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో తీర్పు చెప్పింది. కొన్నిరోజులు జైలు జీవితం గడిపిన తరువాత బెయిల్‌పై బైటకు వచ్చి బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి వీరంతా నిర్దోషులుగా బైటపడ్డారు. అయితే ఈ నలుగురిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకేలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. ఈ అప్పీలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. తీర్పు మంగళవారమే వెలువడే అవకాశాలు ఉన్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY