యుద్ధానికి బయలుదేరిన చిన్నమ్మ..

Posted February 11, 2017 (2 weeks ago)

sasikala going to governor with mlas to asking govt forming
కదిలే కాలంతోపాటు ఆకుల్లా రాలిపోతున్న ఎమ్మెల్యేల్ని చూసి చిన్నమ్మలో కలవరం మొదలైంది. ఆ కంగారులో సమరభేరీ మోగకుండానే యుద్ధానికి బయలుదేరింది.ఇంకా గవర్నర్ నిర్ణయం రాకముందే చిన్నమ్మ ఏకపక్షంగా యుద్ధభేరీ మోగించి కదనరంగంలోకి దూకింది.ఈ ఉదయమే త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్ కి లేఖ రాసిన చిన్నమ్మ కొద్ది గంటల వ్యవధిలోనే స్పీడ్ పెంచారు.మధ్యాహ్నం టైములో పోయెస్ గార్డెన్ నుంచి బయటికి వచ్చిన చిన్నమ్మ ముఖ్య అనుచరులతో కలిసి చెన్నై మెరీనా బీచ్ లోని జయ సమాధి వద్దకు చేరుకున్నారు.అక్కడ నివాళులు అర్పించి తన వర్గం ఎమ్మెల్యేలు వున్న గోల్డెన్ బే రిసార్ట్ కి బయలుదేరి వెళ్లారు.అక్కడ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో సమావేశమై..వారితో కలిసి రాజ్ భవన్ కి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అప్పటికీ ప్రయోజనం లేకుంటే ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పెరేడ్ నిర్వహించాలని శశికళ భావిస్తోంది.సమయం మించిపోతే అవకాశం ఎప్పటికీ రాదని అర్ధం చేసుకున్న శశికళ యుద్ధ భూమిలోకి నేరుగా దిగారు.

NO COMMENTS

LEAVE A REPLY