నెచ్చెలి రివర్స్ డ్రామా మొదలైందా…?

Posted December 10, 2016

sasikala reverse drama in tamil nadu politicsనా అనుకున్న వారెవరికీ ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ స్థానం లేదని అమ్మ నెచ్చెలి శశికళ స్పష్టం చేసింది.తాజాగా జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్స్‌లో తన వాళ్లందరితో నిర్వహించిన ఓ సమావేశంలో శశి కళ కుండ బద్దలు కొట్టేసింది ఆలా బద్దలు కొట్టే రెండు రకాల సంకేతాలను ప్రజల్లోకి పంపిందా ? ఒకటి తాను అధికారంకోసం కాసుకొనికూర్చోలేదని మరొకటి అధికార పీఠం మీద ఎవరున్నా తన కనుసన్నల్లోనే ఉంటుంది కనుక సునాయాసంగా అధికార దర్పం వెలగ బెట్టొచ్చు , విమర్శకుల నోళ్లు మూయించొచ్చు ,దీప పెట్ట బోతున్న పార్టీ కారణం గా చీలికలు నివారించవచ్చు అనే కోణం లో ఈ నిర్ణయం తీసుకొన్నారు అనే చెప్పాలి.

జయలలిత మరణం తర్వాతే శశికళ భర్త నటరాజన్ కూడా తెర మీదకు వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ తన బంధువులు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చక్రం తిప్పడం మొదలుపెడితే అది మరింత నెగెటివ్ ఫలితాలను తీసుకొస్తుందని శశికళ భావిస్తున్నారని, అందుకే తన బంధువులందరినీ దూరం పెడుతున్నారని అన్నాడీంఎకే వర్గాలు తెలిపాయి.

తాను మాత్రం ఎలాంటి పదవులు లేకుండానే ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్లు శశి కళ చెబుతున్న ప్రజామోదం లేదనే సంశయం శశికళ లో అనర్గతం గా వేధిస్తున్న ప్రశ్న. ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఉంటుందని భయపడుతున్న కిందిస్థాయి కార్యకర్తల్లో ఎందరిని ఆమె సమాధానపరుస్తారన్నది కూడా అనుమానంగానే ఉంది. మొత్తంగా శశి కళ రివర్స్ డ్రామా ఎటు పోతుందో తేలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఆర్ కే నగర్ ఉప ఎన్నిక ద్వారా కొంత స్పష్టత వచ్చే అవకాశం వుంది .

Post Your Coment
Loading...