అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీ అయ్యారా?

Posted February 8, 2017

sasikala shifted aiadmk mlas to secret place
తమిళనాట రాజకీయ సంక్షోభం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే చిన్నమ్మ వైపే ఉండాలా ..లేక సెల్వాన్ని నమ్ముకోవాలా?అని వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.సరే చిన్నమ్మ పిలిచింది కదా ..ఆ సమావేశానికి వెళ్లి ఆమె ఏమి చెబుతుందో విన్నాక నిర్ణయం తీసుకుందామని చాలా మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు.అలాగే శశికళ తో సమావేశమయ్యారు.కానీ తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు.ఈ సంక్షోభం ముగిసేదాకా ఓ క్యాంపు నిర్వహిద్దామని మీటింగ్ లో రొటీన్ గా ఓ మాట అన్నారు శశికళ వీరవిధేయులు.సరే ..ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే ..బయటికి రాగానే వారి చేతుల్లో ఫోన్లు లాగేసుకున్నారు శశి అనుచరులు.అదేమంటే అన్నాడీఎంకే చీలిక నివారణ,జయ ఆశయాల సాధన అంటూ వారి నోరు మూయించారు.బయటికి రాగానే వారిని బస్సుల్లో ఎక్కించి రహస్య ప్రదేశాలకి తీసుకెళ్లారు.

శశికళ క్యాంపు లో వున్న ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.అటు కేంద్రం అండ లేకుండా ఈ క్యాంపు లో ఎన్నాళ్ళు బందీలుగా ఉండాలో అని వారి బాధ.ఈ విషయమే అడిగితే క్యాంపు నిర్వాహకులు నోరు మెదపడం లేదంట.దీంతో రాజకీయ భవిష్యత్ సంగతి తర్వాత,ఈ బందీ ఖానా నుంచి ఎంత త్వరగా బయటపడితే అదే చాలని భావిస్తున్నారు ఎమ్మెల్యేలు.

Post Your Coment
Loading...