చిన్నమ్మకి మద్రాస్ హై కోర్ట్ షాక్…

Posted February 10, 2017 (3 weeks ago)

sasikala shocked by madras high court
శశికళకి షాక్ మీద షాక్ తగులుతోంది.ఎవరేమనుకున్నా ఎమ్మెల్యేలు మన చేతిలో వున్నారులే అనుకున్న ఆమె ధీమా సడలుతోంది.ఇంతలో పులి మీద పుట్రలా మద్రాస్ హై కోర్ట్ ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో చెబుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులకి కోర్ట్ ఆదేశాలిచ్చింది.ఎమ్మెల్యేల గురించి పీఎంకే నిన్న దాఖలు చేసిన పిటీషన్ మీద మద్రాస్ హై కోర్ట్ ఈ విధంగా స్పందించింది.

అటు ఓ రిసార్ట్ లో శశి అనుచరుల కనుసన్నల్లో టీవీలు,సెల్ ఫోన్లు లేకుండా గడపడాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.ఏ చిన్న అవకాశం దొరికినా ఈ రొంపి నుంచి బయటపడాలని ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు మద్రాస్ హై కోర్ట్ ఆదేశాలతో నిజంగానే పోలీసులకి వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా దొరికినట్లయింది.

NO COMMENTS

LEAVE A REPLY