శాతకర్ణి ఇన్ అడ్వాన్స్ … !

0
489

Posted November 22, 2016 (2 weeks ago)

satakarni shooting completed successfullyగౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. క్రిష్ పెళ్లి గ్యాప్ తర్వాత 80 రోజుల షూటింగ్ టార్గెట్ పెట్టుకున్న చిత్రయూనిట్ ఓ రోజు ముందుగానే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారట. ఇక గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ప్రస్తుతం అది కూడా ఫాస్ట్ గానే జరుగుతుందట. ఓ పక్క సినిమా చేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసిన శాతకర్ణి టీం సినిమాను అనుకున్న టైంలోనే ఫినిష్ చేసుకుంది.

ఇక డిసెంబర్ మొత్తం అనుకున్న విధంగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక క్రిష్ అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయడానికి హీరో బాలకృష్ణ సహకారం కూడా పూర్తి స్థాయిలో అందించారట. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా వస్తున్న ఈ సినిమా తెలుగు జాతి గర్వపడేలా ఉంటుందని బాలయ్య నమ్మకంతో ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY