అఖిల్ హీరోయిన్ అన్నిటికి సై..!

Posted November 8, 2016

akss11అక్కినేని అఖిల్ మొదటి సినిమాలో తళుక్కున మెరిసింది సయేషా సైగల్.. బాలీవుడ్ ఫ్యామిలీ నుండి వచ్చిన భామ కాబట్టి అమ్మడు కూడా అంతే బోల్డ్ గా మాట్లాడటం చూసి అందరు అవాక్కవుతున్నారు. తెలుగులో ఆ ఒక్క సినిమాతో సరి పెట్టుకున్న సయేషా రీసెంట్ గా అజయ్ దేవగన్ నటించి డైరెక్ట్ చేసిన శివాయ్ సినిమాలో మెప్పించింది.

బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగానే అమ్మడు కూడా లిప్ లాక్స్, బికిని సీన్స్ చేసేందుకు సై అని అంటుంది. అయితే కథకు అవసరం అనుకున్న ఎలాంటి స్కిన్ షో అయినా చేస్తా అంటున్న ఈ భామ న్యూడ్ గా అంటే మాత్రం కష్టమని చెబుతుంది. అఫ్కోర్స్ న్యూడ్ సీన్స్ మన దేశంలో ఇంకా అఫిషియల్ కాలేదు కాని అమ్మడు అక్కడి దాకా ఆలోచించి ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా తాను చేయనని అంటుంది.

న్యూడ్ సీన్స్ దాకా వెళ్లిందంటే కచ్చితంగా ముద్దు సీన్స్ కు ఎలాంటి అభ్యంతరం లేనట్టే. మరి అమ్మడిని ఆ యాంగిల్ లో ఏ డైరక్టర్ చూపిస్తాడో కాని తాను అన్నిటికి సిద్ధమే అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి మిగతా హీరోయిన్స్ కు షాక్ ఇస్తుంది సయేషా సైగల్.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY