శశికళ నవ్వింది!!!

Posted February 13, 2017 (2 weeks ago)

seshiakla has smile on her face
ఎప్పుడూ ముభావంగా కనిపించే శశికళ చాలాకాలం తర్వాత నవ్వింది. అమ్మ మరణం తర్వాత ఎప్పుడూ కనిపించని చిరునవ్వు ఆమె మొహంలో కనిపించింది. నవ్వుతూ ఎమ్మెల్యేలందరికీ అభివాదం చేసింది చిన్నమ్మ. సైగలతోనే నేనున్నానంటూ ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చే ప్రయత్నం చేసింది.

చిన్నమ్మ మొహంలో చిరునవ్వుపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. అక్రమాస్తుల కేసు వాయిదా పడుతుందందని ఆమెకు గట్టి నమ్మకం ఉందట. అదే జరిగితే శశికళకు వేయి ఏనుగుల బలం వచ్చినట్టే. అందుకే కేసును వాయిదా వేయించడం కోసం చిన్నమ్మ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోందని టాక్. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఒకవేళ కేసు వాయిదా పడితే మాత్రం శశికళకు పెద్ద ఆయుధం దొరికినట్టే.

అక్రమాస్తుల కేసు వాయిదా పడితే.. గవర్నర్ విద్యాసాగర్ రావుపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్.. చిన్నమ్మను ఆహ్వానించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

కేసు వాయిదా పడుతుందని గట్టి సమాచారం ఉండడం వల్లే ఇప్పుడు చిన్నమ్మ హ్యాపీగా ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకు చాలాకాలం తర్వాత ముసిముసిగా నవ్విందని టాక్. అయితే కేసు వాయిదా పడితే ఓకే కానీ… లేకపోతే మాత్రం ఆ చిరునవ్వు మాయం కావడానికి ఎంతో టైమ్ పట్టదు. అటు మరికొందరు మాత్రం ఆ నవ్వు వెనక మరో ప్లాన్ ఉందంటున్నారు. తనలోని బాధను బయటకు కనిపించకుండా ఇలా కవర్ చేస్తుందని సెల్వం వర్గం ఆరోపిస్తోంది. వాస్తవం ఏదైనా ఈ పరిస్థితుల్లో ఆమె నవ్వడం మాత్రం మీడియాకు పెద్ద న్యూస్ మరి!!

NO COMMENTS

LEAVE A REPLY