ఎమ్మెల్యేలపై మన్నార్గుడి మాఫియా జులుం!!

Posted February 14, 2017 (2 weeks ago)

seshikala maphia on mlas
తమిళనాడులోని గోల్డెన్ బే రిసార్టులో పోలీసులు విచారణకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అబద్ధమాడారా? తాము స్వచ్చందంగానే వచ్చామని చెప్పింది వాస్తవం కాదా? అంటే ఔననే అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇటీవల శశికళ క్యాంపు నుంచి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. పోలీసుల విచారణ తర్వాత బయటకొచ్చారు. క్యాంపులో ఏం జరిగిందో.. వారు పూస గుచ్చినట్టు సెల్వంకు వివరించారు. ఎమ్మెల్యేల మాటల్లో చెప్పాలంటే… పోలీసుల విచారణకు రావడానికి ముందే మన్నార్గుడి మాఫియా ఎమ్మెల్యేలందరితో విడివిడిగా భేటీ అయ్యిందట. విచారణలో శశికళకు వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చినట్టు టాక్. అలాంటిదేమైనా జరిగితే ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పారట. దీంతో ఎమ్మెల్యేలు బెదిరిపోయారట. అందుకే శశికళకు ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని సమాచారం.

క్యాంపులో కొందరు ఎమ్మెల్యేలపై మన్నార్గుడి మాఫియా జులుం చేస్తోందట. శశికళకు వ్యతిరేకంగా గొంతెత్తే అవకాశం ఉన్న ఎమ్మెల్యేల లిస్టును తయారు చేసి.. వారిని టార్చర్ పెడుతున్నారట. బలనిరూపణలో సపోర్ట్ చేయకపోతే ఎంతకైనా తెగిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

శశికళ వర్గం చెబుతున్న ప్రకారం క్యాంపులో 119 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే. అయినా చిన్నమ్మ భయపడడానికి కారణం క్యాంపులోని ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారనే నమ్మకం లేకపోవడం వల్లేనట. పోలీసు విచారణలో అయితే మ్యానేజ్ చేశాం.. కానీ బలనిరూపణలో అధి సాధ్యం కాదని చిన్నమ్మ టెన్షన్ పడుతోందట. ఎందుకంటే అసలు సినిమా ముందుంది!!

NO COMMENTS

LEAVE A REPLY