మెగా బ్రదర్స్ కి సెక్స్ స్పెషలిస్ట్ షాక్ ..

samaram-comments-on-chirnajeevi-and-pawan-kalyan డాక్టర్ సమరం అనగానే స్వాతి పత్రికలో అయన నిర్వహించే శృంగార శీర్షిక చాలా మందికి గుర్తుకు వస్తుంది.అంతకుమించి ఆయనో హేతువాద కుటుంబం నుంచి వచ్చారని…రాజకీయ అవగాహన,సామాజిక బాధ్యత మెండుగా ఉందని బహుకొద్ది మందికే తెలుసు. అయన ప్రజారాజ్యం పార్టీలో చేరిన విషయం,ఆపై బయటికొచ్చిన విషయం కూడా ఎక్కువమందికి గుర్తుండి ఉండదు. కానీ విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయన ప్రజారాజ్యం గురించి ప్రస్తావించి మెగా బ్రదర్స్ ని ఇబ్బందుల్లోకి నెట్టాడు.కాపులంతా వెనుక నిలబడ్డా కొత్తవాళ్ళకి,యువకులకు సీట్లు ఇవ్వకుండా జంప్ జిలానీలకు పెద్ద పీట వేయడం వల్లే ప్రజారాజ్యం దెబ్బ తిందని సమరం వ్యాఖ్యానించారు.టిక్కెట్లు ఇచ్చినోళ్ల దగ్గర డబ్బు వసూళ్లు జరిగాయని కూడా అయన ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ జనసేన గురించి కూడా సమరం నోరు విప్పాడు.ఈల వేయడానికి,గోల చేయడానికి వచ్చే అభిమానుల వల్ల ఓట్లు రాలవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కి హితవు చెప్పారు సమరం.ఏదేమైనా మెగా బ్రదర్స్ రాజకీయంగా కీలక అడుగులు వేసే దశలో సెక్స్ స్పెషలిస్ట్ సమరం పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY