శంకర్ ముంచుతాడా…తేల్చుతాడా??

Posted February 15, 2017

shankar high budget movieశంకర్.. ఈ పేరు చెబితేనే భారీ బడ్జెట్ గుర్తొస్తుంది. రోబో సినిమాతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ఐ సినిమా తర్వాత కాస్త చతికిలపడ్డాడు. తాజాగా  ఈ భారీ బడ్జెట్ దర్శకుడు రోబోకు సీక్వెల్ గా 2.0 ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ వంటి టాప్ స్టారలతో  పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. కాగా ఇప్పటివరకు కనీవినీ ఎరుగని విధంగా దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్ తో 2.0  సినిమాను రూపొందిస్తున్న శంకర్ ఆ బడ్జెట్ ను మరింత పెంచాడట.  

 మొదట సినిమా బడ్జెట్  రూ. 350 కోట్లు  చెప్పిన శంకర్ , ఆ తర్వాత మరో రూ. 50 కోట్లు పెంచాడట. ఈ మధ్య మరో రూ. 50 కి చేర్చాడట. మొత్తంగా రూ. 450 కోట్ల  ఖర్చు లెక్కతేల్చాడట. సినిమా ఎంత బాగా తీసినా  కానీ మరీ 100 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడని నిర్మాతలు  వాపోతున్నారట. సినిమా హిట్ అయితే పర్లేదని,  ఏమయినా తేడా జరిగి ఐ సినిమాలా అయితే తమ పరిస్థితేంటని బెంబేలు పడుతున్నారట నిర్మాతలు. మరి శంకర్ ముంచుతాడో తెల్చుతాడో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY