శర్వానంద్ ‘మహానుభావుడు’ ..!

 Posted November 4, 2016

srv1416తెలుగులో ఉన్న విలక్షణ నటులలో శర్వానంద్ ఒకరు. సినిమా సినిమాకు తనలోని విలక్షణతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తున్న శర్వానంద్ ఈ ఇయర్ సంక్రాంతి సీజన్లో ఎక్స్ రాజా అంటూ వచ్చి ఎక్స్ ప్రెస్ హిట్ అందుకున్నాడు. పెద్ద సినిమాల పోటీలో కూడా విజయ పతాకన్ని ఎగురవేసిన శర్వానంద్ సత్తా ఎంటో అందరికి తెలిసింది. అయితే ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో సతీష్ వేగేశ్న డైరక్షన్లో శతమానం భవతి సినిమా చేస్తున్న శర్వానంద్ చంద్ర మోహన్ డైరక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ రెండు కాకుండా మారుతి డైరక్షన్లో ఓ సినిమా ఉంటుందని రెండు రోజుల నుండి వినిపిస్తున్న టాక్. బాబు బంగారం తర్వాత మారుతి చేస్తున్న సినిమా ఇది. శర్వానంద్ తో మొదటిసారి కలిసి పనిచేస్తున్న మారుతి ఆ సినిమాకు ‘మహానుభావుడు’ అని టైటిల్ పెట్టాడట. యువి క్రియేషన్స్ వారే ఈ సినిమా నిర్మించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. సో మొత్తానికి మారుతి దర్శకత్వంలో శర్వానంద్ మహానుబహవుడు అనిపించుకుంటాడన్నమాట.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY