భారీ బడ్జెట్ సినిమాలను టార్గెట్ చేసిన శ్రుతి

Posted February 14, 2017

shruti hassan act all big budget moviesలోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసింది శ్రుతి హాసన్. అయినా  అతి తక్కువ కాలంలోనే తన గ్లామర్ తో, నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అవి కూడా భారీ చిత్రాలు కావడం విశేషం . కమల్ హాసన్ చేస్తున్న ‘శభాష్ నాయుడు’ లో చేస్తున్న  ఆమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు కాక తాజాగా ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చిందట.

ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కిస్తున్న ‘సంఘమిత్ర’ సినిమాలో ఒక హీరోయిన్‌గా శృతీహాసన్‌ ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా తెలిపింది. జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కనుంది.  

కాగా మెగాస్టార్ చిరంజీవి చేయబోయే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహరెడ్డిలో కూడా శ్రుతినే  నటించనుందని సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి… తాను తీసిన రేసుగుర్రంలో శ్రుతినే నటించిందని, కాబట్టి చిరు 151వ సినిమాలో కూడా  శ్రుతినే  సెలెక్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాడట. అది  సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అవుతుందని  అనుకుంటున్నాడట. దీంతో  సూరి…  ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కూడా శ్రుతినే హీరోయిన్ గా సెలెక్ట్ చేయనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తానికి  భారీ బడ్జెట్ చిత్రాలు తప్ప చిన్న సినిమాలేమీ  అమ్మడికి కనపడవన్నమాట.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY