వాళ్ళది భార్యాభర్తల బంధమట….

  siddharth nath singh said tdp bjp wife and husband relationship

టీడీపీ, బీజేపీది భార్యాభర్తల సంబంధం లాంటిదని ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్ధనాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ తమ బంధంపై ప్రతిపక్షాలు, మీడియా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు వస్తాయన్న విషయాన్ని ప్రజలకు వెల్లడిస్తామని సిద్ధార్ధనాథ్ సింగ్ తెలిపారు.

హోదా విషయాన్ని చట్టంలో కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఎదురుదాడి చేశారు. టీడీపీ, బీజేపీలు 2019 తర్వాత కూడా కలిసి పని చేస్తాయని సిద్ధార్ధనాథ్ సింగ్ తెలిపారు.

Post Your Coment
Loading...