సైకిల్ ,కాంగ్రెస్ జోడీ ..ఆ ఇద్దరి మ్యాజిక్

Posted January 22, 2017 (5 weeks ago)

sonia gandhi and akhilesh are togetherదేశ రాజకీయాలకి గుండెకాయలాంటి ఉత్తర్ ప్రదేశ్ లో సైకిల్,కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. ఈ పొత్తు ఇక కుదరదేమో అనుకునేంతలో ఇద్దరి చొరవతో పరిస్థితి మారింది.వారిలో ఒకరు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయితే ఇంకొకరు ఆ పార్టీ తరపున వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.అంతకుముందు కాంగ్రెస్ కి కేటాయించే స్థానాల విషయమై సమాజ్ వాదీ పార్టీ గట్టిగా వ్యవహరించడంతో ఇక పొత్తు కుదరదనిపించింది.అసలు ఈ పొత్తు ప్రతిపాదన ఇక్కడి దాకా రావడానికి కారణమైన ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా సీన్ మారలేదు.
దీంతో అలెర్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ నేరుగా సోనియా రంగంలోకి దిగితే బాగుంటుందని రాహుల్ ని ఒప్పించారు.సోనియా నేరుగా అఖిలేష్ తో మాట్లాడడంతో పొత్తు మళ్లీ గాడిలో పడింది. మొత్తం 403 స్థానాలకు గాను కాంగ్రెస్ కి 105 స్థానాలు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారు.

NO COMMENTS

LEAVE A REPLY