ఆ కమెడియన్ వల్లే జూనియర్ కు యాక్సిడెంట్..!

Posted November 25, 2016 (2 weeks ago)

Srinivas Reddy Hot Comment On Ntr Accidentహీరో టర్నెడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయినప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలను బయటపెట్టాడు. 2009 ఎన్నికల సమయంలో టిడిపి తరపున ప్రచారంలో భాగంగా ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న తారక్ కారు యాక్సిడెంట్ కు గురైంది. అయితే ఆ టైంలో శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఉన్నాడట. ఇక తారక్ తో ఉన్న జూనియర్ సన్నిహితుల్లో ఒకరు శ్రీనివాస్ రెడ్డి వల్లే ఈ తప్పిదం జరిగిందని అన్నాడట.

ఇక అక్కడి నుండి తారక్ తో కాస్త దూరం పెరిగిందని అంటుంటారు. అయితే ఈ విషయాల పట్ల శ్రీనివాస్ రెడ్డి అసలు జరిగిన విషయం చెప్పాడు. తనతో పాటు జర్నీ చేస్తున్న తారక్ యాక్సిడెంట్ జరగడం తన వల్ల ఎలా అవుతుందని.. అయితే జూనియర్ స్నేహితులలో ఒకరు తనని అలా అనగానే అక్కడే అతన్ని తిట్టానని అన్నాడు. ఇక ఇప్పటికి తన గురించి తారక్ కు తారక్ గురించి తనతో పాటు అందరికి తెలుసని.. మా మధ్య ఉన్న ఈ డిస్టన్స్ మేము మాత్రమే దగ్గర చేసుకుంటామని అన్నారు.

అయితే శ్రీనివాస్ రెడ్డిని అలా అన్నది ఎవరు.. అసలు జూనియర్ యాక్సిడెంట్ కు శ్రీనివాస్ రెడ్డికి సంబంధం ఏంటి అన్న విషయాలు తెలియాలంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడాల్సిందే.

NO COMMENTS

LEAVE A REPLY