చిన్నమ్మతో చిక్కుల్లేవన్న శృతి ..

 sruthi tells no more fights gouthami
కమల్ హాసన్ కుటుంబం లో ఓ సినిమా చిచ్చు పెట్టిందనే వార్తలు చెన్నై టీ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆయన తీస్తున్న శెభాష్ నాయుడు సినిమా షూటింగ్ సందర్భంగా కమల్ సహచరి గౌతమి ,కూతురు శృతి మధ్య గొడవలొచ్చాయని టాక్ .ఈ సినిమాలో నటిస్తున్న శృతి కాస్ట్యూమ్స్ గౌతమి సెలెక్ట్ చేసింది.అయితే కాస్ట్యూమర్ గా చిన్నమ్మ పనితీరు శృతికి నచ్చలేదట.దీంతో ఇద్దరి మధ్య గొడవలొచ్చి ఎవరికీ చెప్పలేక కమల్ ఇబ్బంది పడ్డారట.

ఈ విషయం పై శృతి మీడియా కి వివరణ ఇచ్చింది.విదేశాల నుంచి వచ్చే అమ్మాయికి సరిపడా దుస్తులు ఎంపిక చేసే విషయంలో చిత్ర యూనిట్ మధ్య చర్చ జరిగింది …నా అభిప్రాయం నేను చెప్పా..అందరి మధ్య ఏకాభిప్రాయంతో పని పూర్తి చేశాము అని శృతి తెలిపింది.చిన్నమ్మ గౌతమితో అందరూ అనుకుంటున్నట్టు ఏ గొడవలు లేవని ఆమె వివరించింది.అయితే శృతి వివరణతో అప్పటిదాకా పుకార్లకే పరిమితమైన గొడవ కన్ఫర్మ్ అయిందని వాటిని పుట్టించిన వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY