నీకు ఎందుకంత దురద సుబ్బూ?

Posted February 14, 2017

subrahmanya swamy more excited
సుబ్రమణ్య స్వామిని రాజకీయ రామ్ గోపాల్ వర్మ గా చెప్పుకోవచ్చు .ఈ మాట అనడం వెనుక ఓ చిన్న పోలిక వుంది.ఈ ఇద్దరి తీరు నచ్చకపోయినా వారి సమర్ధత ని ఒప్పుకునేవాళ్ళు వీరిని దారి తప్పిన మేధావులుగా అభివర్ణిస్తారు.రాము సినిమాల గురించి,పొలిటికల్ నేతల గురించి ఎలా కామెంట్ చేస్తారో అందరం చూస్తున్నాం.ఆశ్చర్యపడుతున్నాం.ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సుబ్రమణ్య స్వామి తీసుకున్న స్టాండ్ చూస్తే అంతకు మించిన ఆశ్చర్యం అనిపిస్తోంది.ఇప్పుడు శశికళ మెడకి ఉచ్చులా చిక్కుకున్న కేసుల్లో కొన్ని ఒకప్పుడు సుబ్రమణ్య స్వామి వేసినవే.ఆయన జయ,శశికళ టార్గెట్ గా కేసులు వేసినప్పుడు అందరూ ఆయన్ని ఓ పిచ్చివాడు అనుకున్నారు.అదే కేసుల్లో జయ,శశికళ ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు వామ్మో స్వామి మేధావి అనుకున్నారు.కానీ ఇప్పుడు అదే స్వామి బీజేపీ లో కొనసాగుతూ శశికళ సీఎం కావాలని గట్టిగా నినదిస్తుంటే తమిళులకు షాక్ లా అనిపిస్తోంది.

సుబ్రమణ్య స్వామి లాంటి అపర మేధావి స్టాండ్ మార్చుకున్నాడంటే దానికి ఏదైనా పెద్ద కారణం ఉండి తీరాలి.శశికళ సీఎం కాకుండా కేంద్రం రాజ్ భవన్ ని అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్న విషయం తమిళనాట చిన్న పిల్లోడికి కూడా అర్ధం అవుతోంది.కానీ తమిళుల్లో ఎలాంటి స్పందన లేదు.నిజంగా శశికళ మీద వారికి ప్రేమ ఉంటే సీన్ ఏ రకంగా ఉండేదో మొన్నటి జల్లికట్టు పోరులో చూసాం.దీంతో ఇప్పుడు సుబ్బు పోరాడుతోంది జనం కోసం కాదని తెలుస్తోంది.శశికకి సపోర్ట్ చేయడం స్వామికి ఎందుకంత అవసరమో ఎవరికీ బోధపడటం లేదు.కేసులు వేసినవాడే ఇలా ఆమె కోసం ఫైట్ చేయడం వెనుక గూడు పుఠాణి ఏమిటో బయటకు రావాలి.స్వామి ఆ విషయాన్ని బయటకు చెప్పాలి.లేదా సుబ్బూ నీకు ఎందుకంత దురద అని తమిళులు నిలదీసే రోజు దగ్గర్లోనే ఉంది.

Post Your Coment
Loading...