సుకుమార్ తో ఏంటి గొడవ..!

Posted November 24, 2016

Sukumar Charan Distabence For Technical Causesక్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్న సుక్కు సినిమాకు సంబందించిన టెక్నికల్ టీం పట్ల చరణ్ తో చర్చలు జరుపుతున్నాడట. అయితే సుక్కు చరణ్ ఇద్దరు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని టాక్. నాన్నకు ప్రేమతో సినిమాకు పనిచేసిన రవింద్రను ఈ సినిమాకు కూడా పెట్టాలని సుకుమార్ నిర్ణయాన్ని కాదన్నాడట చరణ్. ఇక హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఫైనల్ అవుతుందో లేదో అన్న డౌట్.

సో ఈ కారణాలన్ని సుకుమార్ చరణ్ ల మధ్య డిస్టెన్స్ పెంచేస్తుందని అంటున్నారు. దర్శకుడు తన సినిమాకు కావాల్సిన టెక్నికల్ టీం అతని ఇష్టానుసారంగానే పెట్టుకుంటాడు. కాని చరణ్ కాస్త జోక్యం చేసుకుని తనకు నచ్చిన వారినే పెట్టాలని అంటున్నాడట ఈ విషయంపై కాస్త సుక్కు అసహనానికి గురవుతున్నాడని అంటున్నారు. మరి సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఇలా హీరో డైరక్టర్ దెబ్బలాడుకుంటే షూటింగ్ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఎలా అని ఆలోచిస్తున్నారు.

పెద్ద సినిమా కాబట్టి హీరోల్ తాలూఖా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కూడా తమ పట్టు విడవక తప్పదు. మరి సుకుమార్ తను కావాలనుకునే టీం తో సినిమా తీస్తాడో లేక చెర్రి రూట్లోకి వస్తాడో చూడాలి.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY