ఆ దర్శకుడితో సారీ చెప్పించిన హీరోయిన్స్..

     Posted December 29, 2016  

suraj sorry to heroines
ఒక్కొడొచ్చాడు …విశాల్,తమన్నా జంటగా తమిళ్,తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండుచోట్ల సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతోంది.ఆ ఊపులో నోరు జారిన దర్శకుడు సూరజ్ చివరికి సారీ చెప్పక తప్పలేదు.తమన్నా,నయనతార వంటి హీరోయిన్స్ తో పాటు హీరోలు విశాల్, రానా వంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తం చేయడంతో సూరజ్ తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెప్పేసాడు.ఇంతకీ సూరజ్ ఏమన్నాడంటే …

ఒక్కొడొచ్చాడు ప్రమోషన్ కోసం దర్శకుడు సూరజ్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో హీరోయిన్స్ భారీ రెమ్యునరేషన్ కోసమే గ్లామర్ రోల్స్ చేస్తారని తేల్చేసాడు.నటనకి ప్రాధాన్యం కావాలంటే టీవీ సీరియల్స్ చేయొచ్చు కదా …తాను మాత్రం హీరోయిన్ కి మోకాళ్ళ కిందకి డ్రెస్ వేస్తే ఒప్పుకోలేను …డబ్బు కోసమే వాళ్ళు స్కిన్ షో చేస్తారు …ఇలా ఆ ఇంటర్వ్యూ లో రెచ్చిపోయాడు. ఈ విషయం తెలిసిన తమన్నా దర్శకుడు సారీ చెప్పాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేసింది.మహిళా నటీమణుల్ని కించపరిస్తే సహించబోమని చెప్పింది.నయనతార,హీరోలు విశాల్ ,రానా కూడా సూరజ్ వ్యాఖ్యలపై మండిపడ్డంతో ఇది ఎక్కడికి వెళుతుందోన్న భయంతో సారీ చెప్పేసాడు.

Post Your Coment
Loading...