సూర్య విసిరిన దోస ఛాలెంజ్ తో అంజలి, జై డేటింగ్ కన్ఫామ్?

Posted February 8, 2017 (3 weeks ago)

surya posted mm dosa with love jyothika and giving challenge jai and anjali accepted that challengeహీరో సూర్య, జ్యోతికతో కలిసి విసిరిన దోస ఛాలెంజ్ తో హీరోయిన్ అంజలి, జై ల డేటింగ్ విషయం మరోసారి తెరమీదకొచ్చింది. ఈ దోస ఛాలెంజ్ లో జై, అంజలి కూడా పాల్గొనడంతో వాళ్లు డేటింగ్లో  ఉన్న విషయం కన్ఫామే  అంటున్నాయి  కోలీవుడ్ వర్గాలు.

విషయంలోకి వెళ్తే… తమిళంలో జ్యోతిక  నటించిన ‘మగళిర్ ముట్టుమ్’ సినిమా టీజర్ విడుదలైంది. అందులో ‘ఇంట్లో అందరి కోసం లెక్కకు మించి దోసెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా?’ అనే డైలాగ్ ఉంది. దీంతో సూర్య తన భార్య జ్యోతిక కోసం దోసె వేసి, ఆ ఫొటోను  సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతటి ఆగకుండా సూర్య పలువురికి  ఛాలెంజ్‌ కూడా చేశాడు.

ఈ ఛాలెంజ్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందించి దోసెలు వేసి ఫొటోలను పోస్ట్ చేశారు. వారిలో జై కూడా ఉన్నాడు. ఇంకేముంది నాలుగేళ్ల క్రితం నుండి జై, అంజలి డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న రూమర్లు నిజమైపోయినట్లేనని తమిళ సినీ అభిమానులు అంటున్నారు. కానీ  తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని జై, అంజలి ఇప్పటివరకు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే జై పోస్ట్  చేసిన ఈ పిక్ చూసిన వాళ్లు మాత్రం… సూర్య అమ్మకి గానీ భార్యకి గానీ దోసెలు వేయమంటే జై.. అంజలి కోసం వేశాడంటే అంజలికి.. జై కి మధ్య లివింగ్ రిలేషన్ షిప్ ఉందని గుసగుసలాడుతున్నారు. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా దోస ఫొటోను షేర్ చేసి సూర్యకి ఆన్సర్ చేప్పిన  జై ఈ రూమర్లకు కూడా త్వరగా  జవాబిస్తే బెటర్.

 

NO COMMENTS

LEAVE A REPLY