ఆ ట్రైలర్ రిజల్ట్ తో తాప్సి హ్యాపీ..

0
114

tapsyబాలీవుడ్ సినిమా పింక్ ట్రైలర్‌కు ప్రశంసలు దక్కడం పట్ల హీరోయిన్ తాప్సీ సంతోషం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 విడుదల చేసిన పింక్ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో 61 లక్షల మందిపైగా చూశారు. ‘నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. పింక్ సినిమా ట్రైలర్‌కు అనూహ్య స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించింది. ట్రైలర్‌ను చూసి ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మా ప్రయత్నం విజయవంతం కాబోతుంద’ని తాప్సీ ఆశాభావం వ్యక్తం చేసింది.

క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువతులు చేసిన న్యాయపోరాటం నేపథ్యంలో ‘పింక్’ సినిమా తెరెకెక్కింది. సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హరి, ఆండ్రియా తారింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలకానుంది.

NO COMMENTS

LEAVE A REPLY