అఖిల్ కోసం అందాల భామ..!

Posted November 24, 2016

Tabu Entry With Akhil Second Movieఅక్కినేని అఖిల్ రెండో సినిమాకు రంగం సిద్ధమవుతుంది. సంవత్సరం పాటు వెయిట్ చేయించిన అఖిల్ ఎట్టకేలకు తన సెకండ్ సినిమాను కన్ఫాం చేయడమే కాదు దానికి సంబందించిన కార్యక్రమాలను స్పీడ్ గా కానిచ్చేస్తున్నాడు. విక్రం కె కుమార్ డైరక్షన్లో అఖిల్ సెకండ్ మూవీ ఉండబోతుంది. ఇక సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా తమిళ హీరోయిన్ మేఘ ఆకాష్ ను సెలెక్ట్ చేయడం జరిగింది.

ఇక సినిమాకు స్పెషల్ క్రేజ్ కోసం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన హాట్ బ్యూటీ టబుని రప్పిస్తున్నారట. అఖిల్ సినిమాలో టబు ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందట. సినిమాలో ఈ రోల్ గురించి చెప్పగానే టబు అయితే ఈ క్యారక్టర్ కు బాగుంటుందని వెంటనే ఆమెను ఒప్పించాడట నాగార్జున. నాగ్, టబుల రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. ఇద్దరు కలిసి నటించారు కాబట్టి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక అఖిల్ కోసం టబు కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

2008లో ఇదిసంగతి, పాండురంగడు సినిమాల్లో నటించిన టబు ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించింది లేదు. ఈ మధ్యనే పిల్లజమిందార్ అశోక్ అనుష్క లీడ్ రోల్ గా చేస్తున్న భాగమతిలో టబుని తీసుకున్నారని అన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కాని అఖిల్ సినిమాలో మాత్రం టబు ఉంటుందని ఎక్స్ క్లూజివ్ న్యూస్.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY