భారీ యాడ్ లో మెరుస్తున్న తమన్నా..

  tamanna ranaveer singh amithab  act add

మిల్కీ బ్యూటి తమన్నా ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. బాహుబలి, ఊపిరి సినిమాల సక్సెస్ తో ఫాంలోకి వచ్చిన ఈ సుందరి బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఊపిరి హిందీ రీమేక్ కు ఓకె చెప్పేసిన తమ్మూ, లేటెస్ట్ గా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ట్రైలర్ తో హల్ చల్ చేస్తోంది.

రణవీర్ చింగ్ రిటర్న్స్ పేరుతో రూపొందిన ఓ బాలీవుడ్ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ తరహాలో రూపొందిన ఈ ట్రైలర్ లో రణవీర్ సింగ్, అమితాబ్ బచ్చన్ లు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ యాడ్ లో తమన్నా తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ ట్రైలర్ కు దర్శకుడు రోహిత్ శెట్టి. చింగ్స్ సీక్రెట్ అనే చైనీస్ బ్రాండ్.. ఫాస్ట్ ఫుడ్ కంపెనీ తమ ప్రాడక్ట్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందుకే ఇంత భారీ యాడ్ ను మార్కెట్ లోకి వదిలింది.

Post Your Coment
Loading...