వెయిట్ అండ్ సీ యోచనలో గవర్నర్!!

Posted February 11, 2017 (2 weeks ago)

tamil nadu governor vidyasagar rao waiting for court judgement about on sasikala
తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై గవర్నర్ విద్యాసాగర్ రావుకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే మోజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో ఆయన అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలనే కోరుకుంటున్నారాయన. ఆ కారణంతోనే శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. శశికళ పై ఉన్న అక్రమాస్తుల కేసులో వచ్చే వారం తీర్పు రానుంది. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే…సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే మళ్లీ తమిళనాట రాజకీయ అనిశ్చితి తప్పదు. అంతేకాకుండా శశికళ ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యురాలు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 (1) ప్రకారం చట్టసభలో సభ్యులుకాని వ్యక్తులకు శాసనసభలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలా వద్ద అన్నది గవర్నర్‌ విచక్షణాధికారం.

ఇవన్నీ ఆలోచించే… గవర్నర్‌ విద్యాసాగర్ రావు ప్రస్తుతానికి ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే కొనసాగించటానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితులపై తాను తీసుకోబోయే నిర్ణయంపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతానికి తమిళనాడు శాంతిభద్రతల సమస్య కూడా లేదు. దీంతో ఇప్పటికిప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఈ విషయంలో అనవసరంగా తొందరపడొద్దని ఆయన ఆలోచన.

అటు గవర్నర్‌ నివేదిక పంపారన్న వార్తలతో శశికళ వర్గం ఆందోళన చెందుతోంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ గవర్నర్‌ ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవటం రాజ్యాంగ విరుద్దమని ఆ పార్టీ నేతల ఆరోపణ. ఇటు పన్నీర్ వర్గం మాత్రం ఫుల్ ఖుషీలో ఉంది. సభలో బలం నిరూపించుకునేందుకు మరికొన్ని రోజులు సమయం ఇస్తే చాలు అన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి సెల్వం వర్గాలు.

NO COMMENTS

LEAVE A REPLY