శశి ఛాయిస్ తంబీలకు నచ్చలేదా?

Posted February 16, 2017 (2 weeks ago)

Tamil Nadu peoples stones on AIADMK party MLA's cars
శశికళ ఓడినా గెలిచింది…పళనిస్వామి సీఎం గా ఎన్నికయ్యాక అందరూ చెప్తున్న మాట. చివరకు కేంద్రం సైతం శశికళ గుప్పిట చిక్కుకున్న ఎమ్మెల్యేల్ని ఇంచు కూడా కదల్చలేకపోయింది.ఎవరు ఔనన్నా ..కాదన్నా ఇది పచ్చి నిజం.అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ వెంటే వున్నారు.అయితే అదే స్థాయిలో కింది స్థాయి అన్నాడీఎంకే శ్రేణులు శశికళతో ఉన్నాయా ?లేనే లేవు అన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట.ఆ మాట నిజమేనని రుజువు చేసిన సంఘటన చెన్నైలో పళనిస్వామి ప్రమాణస్వీకారం రోజే జరిగింది. శశికళ చెప్పిన పళనిస్వామికి మద్దతుగా ప్రమాణస్వీకారానికి వెళుతున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బృందానికి దారిలో ఓ చేదు అనుభవం ఎదురైంది. Omr ప్రాంతంలో కొందరు ఆ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న కార్ల మీద చెప్పులు,రాళ్లు విసిరి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది.ఇది చిన్న ఘటనే అనుకున్నా శశి ఛాయిస్…ఆమె చెప్పినట్టే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నడుచుకోవడం తమిళ తంబీలకు అంతగా నచ్చలేదనడానికి ఓ సంకేతం.లోలోన రగిలే ఈ అగ్నిపర్వతం ఏదో ఓ రోజు బద్దలు కాకపోదు.కావాలంటే మీరు కూడా ఆ దృశ్యాన్ని ఓ సారి చూడండి…

NO COMMENTS

LEAVE A REPLY