ఆ రిసార్ట్ లో తమిళనాడు డీజీపీ..

Posted February 10, 2017

tamilnadu dgp rajendran to goldenbey resort
గోల్డెన్ బే రిసార్ట్స్ లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్నారా..లేక ఆటపాటలతో ఖుషీగా ఉన్నారా? ఈ విషయం తేల్చే సమయం వచ్చేసింది.మద్రాస్ హై కోర్ట్ ఆ ఎమ్మెల్యేల కి సంబంధించి ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరడంతో పోలీస్ బాస్ రాజేంద్రన్ అలెర్ట్ అయ్యారు.తమిళ డీజీపీ స్థాయిలో రాజేంద్రన్ నేరుగా గోల్డెన్ బే రిసార్ట్ కి వెళ్లారు.అక్కడ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎలా వున్నారో ఆయన స్వయంగా పరిశీలించారు.ఎమ్మెల్యేల్ని వ్యక్తిగతంగా విచారించారు.వారిచ్చే సమాచారం,అభిప్రాయం ఆధారంగా రేపు పోలీస్ శాఖ హై కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేస్తుంది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY