రెండు కాదు …మూడు ముక్కలాట

 Posted February 10, 2017

tamilnadu politics 3 card game
తమిళనాట రాజకీయ పోరు రసకందాయంలో పడింది. గోల్డెన్ బే రిసార్ట్ లో వున్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోడానికి శశికళ…చిన్నమ్మ క్యాంపు లోని ఎమ్మెల్యేల్ని తన దగ్గరకు రప్పించుకోడానికి పన్నీర్ సెల్వం..ఈ ఇద్దరి మధ్య గొడవని అనుకూలంగా మార్చుకోడానికి డీఎంకే..ఇలా ఎవరికి వారు తమ తమ పనుల్లో నిమగ్నమైవున్నారు.

ఎమ్మెల్యేల్ని బందీలుగా చేశారన్న ఆరోపణలపై శశికళ వర్గం గొంతు విప్పింది.అలాంటిదేమీలేదని పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి స్పష్టం చేశారు.ఎట్టి పరిస్థితుల్లో శశికళ సీఎం అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేయడమే కాకుండా ..తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆరోపించారు.ఇక పన్నీర్ ఇంకోసారి శశికళ మీద నిప్పులు చెరిగారు.ఆమె ఎమ్మెల్యేల్ని బందీలుగా ఉంచిందని ఆరోపించారు. వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ ఇద్దరి మధ్య ఎటూ తేల్చుకోలేక విసిగిపోయిన 15 మంది ఎమ్మెల్యేలు డీఎంకే తో టచ్ లోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి.అదే నిజమైతే తమిళ రాజకీయం రెండు కాదు మూడు ముక్కలాట అయినట్టే. ఒకవేళ పన్నీర్ అన్నాడీఎంకేలో పూర్తి మెజారిటీ తో ఎమ్మెల్యేల్ని ఆకట్టుకోలేక..కొద్దిమందికే పరిమితమైనా అప్పుడు కూడా డీఎంకే అవసరం పడుతుంది.అలాగైనా ఇది మూడు ముక్కలాటే.శశి చెప్తున్నట్టు ఆమె చేతిలో 130 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ద్విముఖ పోటీ లేదంటే త్రిముఖమే.

Post Your Coment
Loading...