మోహన్ బాబు రూట్లో పళని..షాక్ తిన్న శశి

Posted February 16, 2017 (2 weeks ago)

tamilnadu politics same like as mohan babu yama dharma raju MA movie
యమధర్మరాజు ఎం.ఏ అని అప్పట్లో మోహన్ బాబు హీరోగా ఓ సినిమా వచ్చింది.ఈ సినిమా మాతృక ఓ తమిళ్ సినిమానే.ఆ సినిమాలో మోహన్ బాబు తనను ఎమ్మెల్యే చేసిన సత్యనారాయణను ఏ మాత్రం లెక్క చేయకుండా అతన్ని పూచికపుల్లలా తీసిపారేస్తాడు.ఎన్నికల కౌంటింగ్ కి ముందు ఓ విధంగా,కౌంటింగ్ అయిపోయి గెలవగానే ఇంకోలా ప్రవర్తిస్తాడు.ఈ సీన్స్ అప్పట్లో మోహన్ బాబు నటనా వైదుష్యానికి,సమకాలీన రాజకీయ పరిస్థితులకి అద్దం పడతాయి. ఆ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా రాజకీయాల్లో పెద్దగా మార్పులు వచ్చింది లేదు.ఇప్పుడు ఆ సినిమాలో మోహన్ బాబు చేసినట్టే పళనిస్వామి కూడా శశికళకి ఓ షాక్ ఇచ్చాడు.

రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగరరావు తో భేటీ తర్వాత మంత్రివర్గ కూర్పు గురించి పోయెస్ గార్డెన్ లోనే చర్చలు సాగాయి.శశికళ కుటుంబసభ్యులు కూడా అందులో పాల్గొన్నారు.తమ కుటుంబం నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉండాలన్నది చిన్నమ్మ అభిమతమని పళనిస్వామి చెవిన వేశారు.విన్నట్టే నటించిన పళనిస్వామి రాబోయే విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని తన టీం లో శశి కుటుంబ సభ్యులు లేకుండా జాగ్రత్త పడ్డారు.ఆ విధంగా మోహన్ బాబు బాటలో శశికి తొలి షాక్ ఇచ్చారు పళనిస్వామి.మంత్రివర్గ విస్తరణ టైం లో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయితే శశికి పన్నీర్ తరహాలోనే పళనిస్వామి కూడా చుక్కలు చూపిస్తున్నట్టే.

NO COMMENTS

LEAVE A REPLY