మోడీ మీద టీడీపీ విసుర్లు…దేనికి సంకేతం?

Posted May 10, 2017 (3 weeks ago) at 18:03

tdp leaders fires on modi because of giving appointment to jagan
వైసీపీ అధినేత ఢిల్లీ వెళ్లి ఎప్పుడైతే ప్రధాని మోడీతో మాట్లాడారో ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు,శ్రేణుల స్వరాల్లో మార్పు వచ్చింది.ఓ వైపు ప్రత్యేక హోదా అంశంలో మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూనే జగన్ కి అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ఆయన మీద టీడీపీ విసుర్లు,విమర్శలు చేస్తోందని వైసీపీ అంటోంది.ఈ మాటల్లో నిజమున్నా లేకపోయినా మోడీని ఓ మాట అంటే జగన్ అండ్ కో కి ఇంత బాధ ఎందుకు కలుగుతోంది? ఇక్కడే ఎన్నో సందేహాలు మొదలవుతున్నాయి.ఇవి మారుతున్న రాజకీయ పరిస్థితులకి సంకేతాలు అన్న డౌట్ వస్తున్నాయి.

ప్రధాని మోడీ,బీజేపీ కి ఏ మాత్రం అనుకూలంగా మాట్లాడినా వైసీపీ కి స్ట్రాంగ్ వోట్ బ్యాంకు గా ఉంటున్న మైనారిటీలు,ఎస్సీలు పార్టీ కి దూరం అవుతారని జగన్ తమ నేతలతో తరచూ అంటుంటారు.కానీ ఈసారి ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ తో పెద్దగా విబేధాలు లేవని చెప్పడం ద్వారా జగన్ సరికొత్త సమీకరణాలకు తెర లేపారు.ముంచుకొస్తున్న కేసులు,ఎన్నికలని సమర్ధంగా ఎదుర్కోవాలంటే మోడీకి,బీజేపీ కి జగన్ లొంగితీరాల్సిన పరిస్థితి.ఈమేరకు తాజా పర్యటనతో జగన్ దాదాపు తెల్ల జెండా ఎత్తినట్టే.అయితే ఈ సంధికి ఒప్పుకుంటుందో,లేదో అన్నది ఇప్పుడు బీజేపీ ఆడే రాజకీయ ఆట మీద ఆధారపడి ఉంటుంది.

Post Your Coment
Loading...