ఎంతవారలైనా రాయపాటి ‘దండ’యాత్రకి తలవంచాల్సిందే..

 Posted October 18, 2016

rayapati sambasiva rao make rose petals garland for guests
ఎవరైనా దండయాత్రకు వస్తున్నారంటే భయపడతారేమో గానీ …అయన దండయాత్రకు వస్తుంటే మాత్రం తలవంచుతారు …ఆనందిస్తారు..ఆస్వాదిస్తారు.అయన మరెవరో కాదు గుంటూరు జిల్లా రాజకీయ దిగ్గజం రాయపాటి సాంబశివరావు.రాయపాటి దండయాత్రకి తలవంచి ఆస్వాదించినవారిలో అమెరికా అధ్యక్ష కుటుంబం మొదలుకొని రాష్ట్ర మంత్రులదాకా వున్నారు.రాయపాటి దండయాత్రలో సుగంధ ఆయుధాలు, కేరళ సైనికులు పాల్గొంటారు.ఆ ‘దండ’యాత్ర ప్రాంగణం సువాసనతో నిండిపోతుంది.ఇంతకీ ఆ దండయాత్ర ఏమిటో ఇంకా తట్టలేదా?

రాయపాటి ప్రతి సందర్భంలో అతిధి సత్కారాన్ని వెరైటీ గా ఉండేలా ప్లాన్ చేస్తారు.అతిధులకు,పెద్దలకి అయన వేసేవి పూలదండలు కాదు.సుగంధ ద్రవ్యాలతో దండలు చేయించడం అయన స్పెషల్.యాలకులు,కర్పూరంతో అయన దండలు చేయిస్తారు.కేరళ లో నిపుణులైన వారికి ఈ పని అప్పగిస్తారు.ఒక్కో సందర్భంలో అంతకు మించి కూడా చేస్తారు.రాయపాటి బహూకరించిన ముత్యాల దండ చూసి భారత్ పర్యటనకి వచ్చిన ఒబామా సతీమణి ఖుషీ అయిపోయారు.

ఇప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాలకుల దండ సత్కారం తర్వాత దాని గురించి రాయపాటికి ప్రత్యేకంగా అడిగారట.ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయపాటి దండ యాత్రపై ప్రశంసలు కురిపించారు.బాబు,లోకేష్,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఇటీవల రాయపాటి వెరయిటీ దండయాత్రకు తలవంచినోళ్లే.అప్రతిహతంగా సాగుతున్న రాయపాటి దండయాత్ర ఖర్చు కూడా తక్కువేమీ కాదు.ఒక్కో యాలకుల దండ 20 వేలకి పైమాటే.ఇక కర్పూరం దండ ధర అంత లేకున్నా దాని సువాసనకు అతిధి ఆలా ఫ్లాట్ అయిపోవాల్సిందే.ఇలా సుగంధ ఆయుధాలతో పెద్దల్ని తలొంచేలా చేస్తున్న రాయపాటి రాజకీయాన్ని సెహబాష్ అనాల్సిందే.

rayapati-sambasiva-rao-make-rose-petals-garland-for-guests-2rayapati-sambasiva-rao-make-rose-petals-garland-for-guests-1rayapati-sambasiva-rao-make-rose-petals-garland-for-guests-3

Post Your Coment
Loading...