తేజస్వికి ఆ మచ్చట కూడా తీరింది.. ఇక ఖాళీ

 Posted May 6, 2017 (4 weeks ago) at 17:42

tejaswi act adult movie for movie chances
తెలుగమ్మాయి తేజస్వి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. అంతకు ముందు చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. సీతమ్మ సినిమా తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఫుల్‌ బిజీ హీరోయిన్‌, నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు గత కొన్ని నెలలుగా అవకాశాలు లేక దిక్కు చూస్తుంది. ఈ సమయంలోనే ఈమెకు ‘బాబు బాగా బిజీ’ చిత్రం అవకాశం దక్కింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి తనకు మళ్లీ ఆఫర్లను తెచ్చి పెడుతుందని భావించింది. కాని తాజాగా విడుదలైన ‘బాబు బాగా బిజీ’ సినిమా సక్సెస్‌ కాలేదు.

ఆ సినిమాలో చాలా మంది హీరోయిన్స్‌ ఉండటంతో పాటు ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. దాంతో ఈమె సినిమాలో ఉందా లేదా అనిపించేలా ఉంది. మొత్తానికి ఈమె ఇకపై టాలీవుడ్‌ ఆశలు గల్లంతయినట్లే అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడు తమిళం లేదా మలయాళంలో అవకాశాల కోసం వెదుక్కోవాల్సిందే అంటూ కొందరు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హాట్‌ ఫొటో షూట్స్‌తో జనాలను రెచ్చగొడుతున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ మంచి సినిమాతో వచ్చి తానేంటో నిరూపించుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది. కాని ఈమెకు ఆ మంచి అవకాశం ఇచ్చేది ఎవరో చూడాలి.

Post Your Coment
Loading...