వలస నేతల డీల్స్ చూసేది ఈయనేనా..?

 Posted May 8, 2017 (3 weeks ago) at 09:22

telangana tdp and congress leaders meets bjp general secretary ram madhav for party changingబీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల రచించిన ఆపరేషన్ సెవెన్ స్టేట్స్ లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు కాషాయ పార్టీ తెరతీసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాషాయ కండువా కప్పుకున్నారు. మే నెల చివరి వారంలో కమలదళపతి అమిత్ షా తెలంగాణాలో మూడు రోజులు పర్యటిస్తున్న నేపథ్యంలో పలువురు సీనియర్లు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఉత్తరాది విజయంతో ఊపుమీదున్న బీజేపీ తెలంగాణపై కన్నేసి స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో వస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారని టాక్ వినిపిస్తోంది.అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీలో చేరే నేతల విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయన సోదరుడైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి. ఈ ముగ్గురు నేతలతో సహా పలువురు సీనియర్లు బీజేపీపై మోజు చూపుతున్నట్లు మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

అయితే తెలంగాణ బీజేపీలో ముఖ్యనేతలు ఎవ్వరూ ఇతర పార్టీల నుంచి వచ్చే ముఖ్యనేతలకు అవకాశమివ్వకపోవడంతో కమలంపార్టీపై ఆసక్తి ఉన్న టీడీపీ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు నేతలు ఆశ్రయిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సన్నిహితుడనే పేరున్న తెలుగు నాయకుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్.

Post Your Coment
Loading...