తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఆశ వదులుకుందా?

0
285

telugu states bjp
సొంతంగా ఎదగాలి ..సొంతంగా ఎదగాలి…మోడీ నేతృత్వాన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయినదగ్గరనుంచి కమలనాధుల మంత్రమిదే.ఆ ప్రయత్నంలోనే మిత్రుల్ని కూడా దూరం పెట్టారు.ఢిల్లీ ,బీహార్..ఇలా ఎదురు దెబ్బలు తగిలినా పెద్దగా పట్టించుకోలేదు.యూపీ,పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కమలనాధుల ఆలోచనాధోరణి లో మార్పు కన్పిస్తోంది.పైకి ఈ మార్పు హఠాత్తుగా అనిపించినా కొన్నాళ్లుగా మేధోమధనం సాగుతూనే వుంది.
జాతీయ స్థాయిలో మళ్లీ ఒకే పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలపై బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వే లో అది సాధ్యం కాదన్న సంకేతాలే కనిపించాయట.పైగా గడిచిన రెండేళ్లలో అధికారం అండగా వున్నా ప్రాంతీయ శక్తులేవి కొత్తగా దరిచేరకపోవడం కమలాన్ని ఆత్మశోధనలో పడేసింది.పరిస్థితులు ఇలా వున్నప్పుడే గుజరాత్ లో అధికార మార్పిడి, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చాయి.నిన్నమొన్నటిదాకా ఈ విషయాలు బీజేపీకి స్వల్పమైనవిగా భావించింది.డీల్ చేయబోయే సరికి లోతు తెలిసొచ్చింది.మోడీ సొంత రాష్ట్ర పరిణామాలే పంటికింద రాయిలా మారినపుడు …..చంద్రబాబు లాంటి భాగస్వామి స్వరం పెంచుతున్నపుడు …అతి విశ్వాసం వల్ల ఎదురయ్యే పరిణామాలు హైకమాండ్ కి ఎంతోకొంత అర్ధం అయ్యాయి.దేశవ్యాప్తంగా ప్రాంతీయ శక్తులు పుంజుకుంటే మళ్లీ కాంగ్రెస్ కి పరోక్ష ఆసరా తామే ఇచ్చినట్టు అవుతుందని కమలం భావిస్తోంది .ముఖ్యంగా దక్షిణాదిన కాంగ్రెస్ కోలుకుంటే ..అక్కడ ప్రాంతీయ శక్తులు బలహీనపడితే ..అనుకున్నట్టు తాము ఎదగలేకపోతే …రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి మారుతుందన్నది బీజేపీ భయం.
ఈ ఆలోచనలోస్పష్టత వచ్చాకే తెలుగు రాష్ట్రాల్లో బలమైన మిత్రుల పై ఆధారపడటానికి కమలం సిద్ధం అయింది.అటు చంద్రబాబుకి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విషయంలో సాయం చేస్తే చాలు .ఇటు కేసీఆర్ రాజాకీయ దండయాత్రకు కాంగ్రెస్ నెమ్మదిగా కౌంటర్ ఇస్తోంది.అందుకే ఎన్నికలముందు లేక తరువాత గులాబీ చేయందుకోవాలని కమల వ్యూహం.కేసీఆర్ మనసులోకూడాఅదే ఆలోచన నడుస్తోంది .అందుకే కమలంప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో సొంతబలం అన్న ఆలోచన పక్కనపెట్టి విశ్వసనీయ మిత్రులపైనే ఆధార పడాలనుకుంటోంది.

NO COMMENTS

LEAVE A REPLY