జగన్ లేఖ గుట్టు ఇదే …

0
1667

Posted November 24, 2016 (2 weeks ago)

the story behind jagans letter
పెద్ద నోట్ల రద్దు మీద ఇన్నాళ్ళకి జగన్ స్పందించాడు.ప్రధాని మోడీకి ఇది మంచి నిర్ణయమే కానీ అమల్లో ఇబ్బందులున్నాయంటూ లేఖ రాసాడు.ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి మోడీని సుతారంగా చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు .నిర్ణయం జరిగిన పదిహేను రోజులకి జగన్ ఈ లేఖ రాయడం వెనుక వున్న గుట్టు రట్టు అయింది .

పెద్ద నోట్ల రద్దు మీద దేశ వ్యాప్తంగా 13 రాజకీయ పక్షాలు ఢిల్లీ వేదికగా గొంతెత్తాయి.దాదాపు 200 మంది ఎంపీలు పార్లమెంట్ వద్ద ధర్నాకి దిగారు .జంతర్ మంతర్ వద్ద బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధర్నా చేపడితే పెద్ద ఎత్తున విపక్ష పార్టీల నేతలు వచ్చారు.ఈ నెల 28 న విపక్షాలు భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి.అయితే అవసరమైతే మోడీ సర్కార్ మీద ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధమని చెప్పిన జగన్ మాత్రం ఈ 15 రోజుల్లో ఒక్కసారి కూడా ఢిల్లీ కివెళ్ళలేదు. విపక్ష పార్టీలతో కలిసి నడవలేదు.ఢిల్లీ చర్చల్లో విపక్ష పార్టీల మధ్య ఏపీ ప్రస్తావన వచ్చిందట.వైసీపీ వ్యవహారశైలి గురించి మాట్లాడిన కొందరు నేతలు జగన్ కేసుల వల్లే దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొస్తే …ఓ వామపక్ష నేత మాత్రం భిన్నంగా స్పందించారట.జగన్ యాటిట్యూడ్ షాకింగ్ గా వుందన్నారట .జగన్ ,చంద్రబాబు ఒక్కటే అని …వాళ్ళు అవసరాలకి తగ్గట్టు రాజకీయాలు చేస్తారు కానీ సిద్ధాంత పరమైన నిబద్ధత ఏ మాత్రం లేదని వ్యాఖ్యానించారట.అయన అవసరానికి ఢిల్లీ వచ్చి అందర్నీ కలిసి విజ్ఞాపనలు చేసే జగన్ ఒక్కసారైనా ఇప్పుడు ఢిల్లీ వచ్చారా అని ప్రశ్నించారట .ఈ విషయం జగన్ చెవిన పడిందట.2019 ఎన్నికల్లో వామపక్షాల తో పని గుర్తొచ్చిందేమో వెంటనే పెన్ను చేపట్టి మోడీ గారికి లేఖ …ప్రెస్ మీట్ పెట్టి బాబుకి చీవాట్లు సమర్పించారు.ఇంతా చేసి ఆ వామపక్ష నేత చెప్పిందే ఇంకోసారి నిజం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY